క్రికెట్ అభిమానులకు పిడుగు లాంటి వార్త ఇది. వస్తున్న నివేదికలను బట్టి.. వరల్డ్ కప్ 2023లో భాగంగా అక్టోబర్ 14న దాయాది దేశాల(ఇండియా vs పాకిస్తాన్) మధ్య జరగబోయే మ్యాచ్ టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ టికెట్ల ధరలు కనిష్టంగా రూ. 2వేలు మొదలు గరిష్టంగా లక్ష రూపాయల మధ్య ఉండనున్నాయట. ఈ లెక్కన కుటుంబంతో కలిసి లగ్జరీగా మ్యాచ్ చూడాలంటే లక్షలు వెచ్చించాల్సిందే.
ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ టికెట్ రేట్లు(అంచనా)
బ్లాక్‌లు:
- K,L,P & Q - రూ.2,000
- J & R - రూ.2,500
- B, C, F & G - రూ. 3,500
- M & N - రూ.4,000
- A & H - రూ.4,500
- D & E - రూ.6,000
- సౌత్ ప్రీమియం ఈస్ట్ మరియు వెస్ట్ - రూ.10,000
- ప్రెసిడెంట్ గ్యాలరీ - రూ. 25,000
- ప్రెసిడెంట్ సూట్ L5 మరియు రిలయన్స్ బాక్స్‌లు - రూ. 75,000
- ప్రెసిడెంట్ సూట్ L4 - రూ. 1,00,000
Tentative prices for India vs Pakistan ODI world cup match :
— All About Cricket (@allaboutcric_) August 10, 2023
All prices are in INR
Blocks -
K,L,P & Q - 2,000
J & R - 2,500
B, C, F & G - 3,500
M & N - 4,000
A & H - 4,500
D & E - 6,000
South Premium east & west - 10,000
President Gallery - 25,000
President suit L5 & Reliance… pic.twitter.com/hpMNjHG7gD
ఆగస్టు 25 నుంచి టికెట్ల అమ్మకాలు
వరల్డ్ కప్ మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలు ఆగస్టు 25వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే ఇండియా మ్యాచ్ ల టికెట్లు మాత్రం దశల వారీగా అందుబాటులోకి రానున్నాయి. వార్మప్ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు ఆగస్టు 30 నుంచి మొదలుకానుండగా.. ప్రధాన మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలు ఆగస్టు 31 నుంచి స్టార్ట్ అవుతాయి. హైవోల్టేజ్ ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు సెప్టెంబర్ 3వ తేదీన అమ్మనున్నారు. అలాగే సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌కు చెందిన టికెట్లను సెప్టెంబర్ 15న అమ్మనున్నారు. టికెట్లు కావాలనుకునే వాళ్లు https://www.cricketworldcup.com/register ఈ వెబ్‌సైట్‌లో ఆగస్టు 15వ తేదీ నుంచి రిజిస్టర్ చేసుకోవాలి.
- ALSO READ : World Cup 2023: ఈడెన్ గార్డెన్స్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఆటగాళ్ల బ్యాట్లు, కిట్లు
లక్షా 32వేల మందికి అవకాశం
అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా- పాక్ మ్యాచ్ జరగనుంది. దీని సామర్థ్యం లక్ష మంది కాగా, హైవోల్టేజ్ దృష్ట్యా దానిని లక్షా 32వేలకు పెంచినట్లు తెలుస్తోంది.
India ?? vs Pakistan ??
— All About Cricket (@allaboutcric_) August 6, 2023
14th October ?
1,32,000 spectators ?
ODI world cup ?
Get ready for the biggest cricketing event ? pic.twitter.com/gXdzKiOpfz