18 దేశాలను చుట్టిరానున్న వరల్డ్ కప్ 2023 ట్రోఫీ

18 దేశాలను చుట్టిరానున్న వరల్డ్ కప్ 2023 ట్రోఫీ

ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023కు బీసీసీఐ ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ తమ వైపే చూసేలా కన్నుల పండుగగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించాలని చూస్తోంది. అందుకే ఎవరూ ఊహించని విధంగా వరల్డ్ కప్ ట్రోఫీని అంతరిక్షంలో లాంఛ్ చేసింది. భూమికి 1,20,000 అడుగుల ఎత్తులో ఉన్న స్ట్రాటోస్పియర్‌లోకి ట్రోఫీని పంపింది. అనంతరం ట్రోఫీని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో సేఫ్‌గా ల్యాండ్ చేశారు.

వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభమవ్వడానికి సరిగ్గా 100 రోజుల సమయముంది. ఈ వంద రోజుల్లో వరల్డ్ కప్ ట్రోఫీ 18 ప్రపంచ దేశాలను చుట్టిరానుంది. జూన్ 27 నుండి భారత్‌లో ప్రారంభమయ్యే ట్రోఫీ టూర్.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినియా, యుఎస్ఎ, వెస్టిండీస్, పాకిస్తాన్, ఫ్రాన్స్, ఇటలీ సహా 18 దేశాలకు వెళ్లనుంది. తిరిగి సెప్టెంబర్ 4న భారత్ చేరుకోనుంది. బీసీసీఐ- ఐసీసీ సంయుక్తంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 10 లక్షల మందికి ఈ ట్రోఫీని నేరుగా చూసే అవకాశం కలగనుంది.

ALSO READ:శ్యామ్ మరణం మనసును కలిచివేసింది : ఎన్టీఆర్

వరల్డ్ కప్ ట్రోఫీ టూర్ షెడ్యూల్

27 జూన్ -14 జూలై: ఇండియా
15 - 16 జూలై: న్యూజిలాండ్
17 - 18 జూలై: ఆస్ట్రేలియా
19 - 21 జూలై: పాపువా న్యూ గినియా
22 - 24 జూలై: భారతదేశం
25 - 27 జూలై: యూఎస్ఏ
28 - 30 జూలై: వెస్టిండీస్
31 జూలై - 4 ఆగస్టు: పాకిస్తాన్
5 - 6 ఆగస్టు: శ్రీలంక
7 - 9 ఆగస్టు: బంగ్లాదేశ్
10 - 11 ఆగస్టు: కువైట్
12 - 13 ఆగస్టు: బహ్రెయిన్
14 - 15 ఆగస్టు: భారతదేశం
16 - 18 ఆగస్టు: ఇటలీ
19 - 20 ఆగస్టు: ఫ్రాన్స్
21 - 24 ఆగస్టు: ఇంగ్లాండ్
25 - 26 ఆగస్టు: మలేషియా
27 - 28 ఆగస్టు: ఉగాండా
29 - 30 ఆగస్టు: నైజీరియా
31 ఆగస్టు - 3 సెప్టెంబర్: దక్షిణాఫ్రికా
సెప్టెంబర్ 4: ఇండియా

అంతరిక్షంలో ట్రోఫీ లాంచ్ చేసిన వీడియో..
 

An out-of-this-world moment for the cricketing world as the #CWC23 trophy unveiled in space. Marks a milestone of being one of the first official sporting trophies to be sent to space. Indeed a galactic start for the ICC Men's Cricket World Cup Trophy Tour in India. @BCCI @ICCpic.twitter.com/wNZU6ByRI5

— Jay Shah (@JayShah) June 26, 2023