సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ ఓటమి టీమిండియా టెస్టు ర్యాకింగ్‌పై పెద్ద దెబ్బ కొట్టింది. వరల్డ్ టాప్ టెస్ట్ టీమ్‌గా ఉన్న ఇండియా రెండు స్థానాలు కిందికి జారిపోయింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో మన టీమ్ మూడో ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టి.. ఐదింట్లో నాలుగు మ్యాచ్‌లను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా రెండు ప్లేసులు ఎగబాకింది. మూడో స్థానంలో ఉన్న ఆసిస్ టీమ్ ఏకంగా ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది. న్యూజిలాండ్ యథావిధిగా గతంలో మాదిరిగా తన సెకండ్ ర్యాంకును పదిలపరుచుకుంది.
పాక్ కిందికి.. సఫారీ పైకి!
టీమిండియాపై మూడు టెస్టు మ్యాచ్‌ల రెండు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్న సౌతాఫ్రికా తన ర్యాంకును ఒక పొజిషన్ మెరుగుపరుచుకుంది. ఆరో స్థానంలో ఉన్న సఫారీ టెస్టు టీమ్ తాజాగా ఐదో ర్యాంకును సొంతం చేసుకుంది. ఇక దాయాది దేశం పాకిస్థాన్ కూడా తన టెస్టు ర్యాంకును స్థిరంగా ఉంచుకోలేకపోయింది. ఐదో స్థానంలో ఉండిన పాక్ టెస్టు టీమ్ ఒక అడుగు కిందికి పడి.. ఆరో ర్యాంకుతో సరిపెట్టుకుంది.
? 4-0 #Ashes series winners
— ICC (@ICC) January 20, 2022
? Second on the #WTC23 table
? Top-ranked Test team in the world!
Australia's rise to the summit of the MRF Tyres rankings ?https://t.co/heNbOrq0km