రెండో ర్యాంక్‌‌‌‌లోనే సూర్య

రెండో ర్యాంక్‌‌‌‌లోనే సూర్య

దుబాయ్‌‌‌‌‌‌‌‌ : టీమిండియా బిగ్‌‌‌‌‌‌‌‌ హిట్టర్‌‌‌‌‌‌‌‌ సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లోనే కొనసాగుతున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో అతని ఖాతాలో 797 రేటింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు ఉన్నాయి. ఓపెనర్‌‌‌‌‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ (743) నాలుగు ప్లేస్‌‌‌‌‌‌‌‌లు మెరుగుపడి ఆరో ర్యాంక్‌‌‌‌‌‌‌‌లోకి దూసుకొచ్చాడు. రుతురాజ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌ (684) 7 నుంచి 8వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌కు పడిపోయాడు.  

జింబాబ్వేతో సిరీస్‌‌‌‌‌‌‌‌కు కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (533) ... 36 ప్లేస్‌‌‌‌‌‌‌‌లు ఎగబాకి 37వ స్థానం సంపాదించాడు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా నుంచి ఒక్కరికి కూడా టాప్‌‌‌‌‌‌‌‌–10లో చోటు దక్కలేదు. అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ ఒక ప్లేస్‌‌‌‌‌‌‌‌ దిగి13వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు.

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ ఆదిల్‌‌‌‌‌‌‌‌ రషీద్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్స్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా నాలుగు ప్లేస్‌‌‌‌‌‌‌‌లు దిగజారి ఆరో ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో, అక్షర్‌‌‌‌‌‌‌‌ 13వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను సాధించారు. సుందర్‌‌‌‌‌‌‌‌ 41, శివం దూబే 43వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ల్లో ఉన్నారు.