
దుబాయ్: బంగ్లాదేశ్ వేదికగా జరిగే విమెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ఆదివారం విడుదల చేసింది. మొత్తం 10 టీమ్స్‌ను రెండు గ్రూప్‌లుగా విభజించింది. గ్రూప్–ఎలో ఇండియాతో పాటు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, క్వాలిఫయర్–1.. గ్రూప్–బిలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, స్కాంట్లాండ్ ఉన్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్–2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 3 నుంచి 20 వరకు టోర్నీ జరగనుంది. అక్టోబర్ 4న జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఇండియా.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది. 6న పాక్‌తో, 9న క్వాలిఫయర్–1తో, 13న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు ఆడుతుంది.