T20 World Cup 2024: రషీద్ ఖాన్‌కు ఐసీసీ మందలింపు.. ఏం జరిగిందంటే..?

T20 World Cup 2024: రషీద్ ఖాన్‌కు ఐసీసీ మందలింపు.. ఏం జరిగిందంటే..?

ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఐసీసీ రూల్ అతిక్రమించాడు. దీంతో అతనిపై ఐసీసీ అతనికి ఒక డీ మెరిట్ పాయింట్ ను ఇచ్చారు. మంగళవారం(జూన్ 25) సూపర్ 8 లో భాగంగా బంగ్లాదేశ్ పై జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో సహచర ఆటగాడు కరీం జనత్ పై దురుసు ప్రవర్తన కారణంగా ఐసీసీ అతనికి ఈ శిక్ష విధించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒక ఆటగాడిపై ప్రమాదకరమైన రీతిలో బంతిని లేదా ఏదైనా క్రికెట్ పరికరాలను విసిరితే అది ఆర్టికల్ 2.9 కింద నేరంగా పరిగణించబడుతుంది. 

అసలేం జరిగిందంటే..?

ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కు కట్టలు తెచ్చుకునే కోపం వచ్చింది. ఈ ఓవర్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన రషీద్ ఖాన్ బంతిని బౌండరీ పంపించడంలో విఫలమయ్యాడు. అక్కడ పైకి లేవడంతో ఫీల్డర్ ఒక క్యాచ్ మిస్ చేశాడు. అప్పటికే ఒక పరుగు పూర్తి చేసిన రషీద్.. రెండో పరుగుకు రావాల్సిందిగా కోరాడు. రన్ తీసే అవకాశం ఉన్నా కరీం జనత్ రెండో పరుగు తీసేందుకు ఆసక్తి చూపించలేదు. ఈ దశలో రషీద్ కోపంతో బ్యాట్ ను జనత్ వైపు  విసిరి తన అసహనాన్ని ప్రదర్శించాడు. 

Also Read:గయానాలో భారీ వర్షం.. భారత్ ఇంగ్లాండ్ సెమీస్ జరిగేనా..?

సెమీస్ కు ఆఫ్ఘనిస్తాన్ 
  
ఇక ఈ మ్యాచ్ లో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. మంగళవారం (జూన్ 25) హోరీహోరీగా సాగిన చివరి లీగ్ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి సెమీస్ కు చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. డక్ వర్త్ లూయిస్ విధించిన 114 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 105 పరుగులకు ఆలౌటైంది.