ఇండియాలో ఆడేందుకు సిద్ధమేనా?: ఐసీసీ

ఇండియాలో ఆడేందుకు సిద్ధమేనా?: ఐసీసీ


కరాచీ: ఇండియాలో వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అనే అంశాన్ని తేల్చేందుకు ఐసీసీ పెద్దలు.. పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు (పీసీబీ)తో సంప్రదింపులు మొదలుపెట్టారు. ఈ మేరకు ఐసీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రెగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లే, సీఈవో జెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్లార్డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రత్యేకంగా లాహోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యటిస్తున్నారని క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్గాలు వెల్లడించాయి. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడేందుకు ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాకపోతే తాము కూడా వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడేందుకు అక్కడికి వెళ్లబోమని గతంలో పీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నజామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేథీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యత సంతరించుకున్నది.

‘ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతిపాదించిన హైబ్రిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐసీసీకి ఇష్టం లేదు. అందుకే వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయాన్ని ముందుగానే తేల్చేందుకు బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లే, అల్లార్డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగంలోకి దిగారు. టోర్నీ కోసం ఇండియాకు వస్తారా? లేదా? అన్న అంశంపై చర్చలు మొదలుపెట్టారు. పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భద్రతాపై ఐసీసీ పూర్తి హామీ ఇవ్వనుంది. మిగతా విషయాలను పక్కనబెట్టి ఇండియాకు వస్తే టోర్నీ విజయవంతం అవుతుందని వాళ్లు భావిస్తున్నారు. మరి పీసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి’ అని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.