విరాట్ కోహ్లీ అంటే క్రికెట్ లో బ్యాటింగ్ మాత్రమే కాదు.. ఫీల్డింగ్ లోనూ అదరగొట్టేస్తాడు. వికెట్ల మధ్య చక చక పరుగులు తీసే కింగ్.. మైదానంలో పాదరసంలా కదులుతాడు. తన ఫీల్డింగ్ విన్యాసాలతో ఎన్నో పరుగులను సేవ్ చేసే కోహ్లీ.. నిన్న ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మూడో టీ20లో మరోసారి తన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇందులో ఆశ్చర్యం లేకపోయినా కోహ్లీ ఇచ్చిన పోజ్ అచ్చం బుమ్రాను పోలి ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని ఐసీసీ షేర్ చేసింది.
బెంగళూరు వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో 213 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు గట్టి పోటీనిస్తుంది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారుతున్న సమయంలో కోహ్లీ చేసిన ఫీల్డింగ్ వావ్ అనిపించేలా ఉంది. వాషింగ్ టన్ సుందర్ వేసిన 17 ఓవర్ ఐదో బంతికి ఒక షార్ట్ డెలివరీని జనత్ లాంగ్-ఆన్ ఫెన్స్ వైపు లాగాడు. ఈ బంతి సిక్సర్ వెళ్తుందని అందరూ భావించినా.. కోహ్లీ గాల్లోకి ఎగిరి బంతిని బయట పడేసి బౌండరీ తాడును టచ్ చేశాడు. కోహ్లీ చేసిన ఈ అద్భుతమైన ఫీల్డింగ్ కు ఫ్యాన్స్, కామెంటేటర్లు ఆశ్చర్యపోయారు.
కోహ్లీ సేవ్ చేసిన ఈ సిక్సర్ అచ్చం బుమ్రా బౌలింగ్ చేసినట్లు ఉండడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ పిక్ ను గమనించి.. కోహ్లి, బుమ్రా ఫోటోలను పక్క్కపక్కనే పెట్టి ఐసీసీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. "ది పర్ఫెక్ట్ మిర్రర్ ఇమేజ్ డోస్ నాట్ ఎక్సి...."అనే క్యాప్షన్ ను జోడించింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ తొలి బంతికే అవుట్ అయ్యాడు. మరోవైపు బుమ్రా ఈ సిరీస్ కు రెస్ట్ తీసుకొని ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్నాడు.
అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. మ్యాచ్ లో ఇరు జట్లు 212 పరుగులు చేశాయి. తొలి సూపర్ ఓవర్లో అఫ్గాన్ 16 రన్స్ చేయగా.. ఇండియా కూడా 16 రన్స్ చేసింది. రెండో సూపర్ లో ఇండియా 5బాల్స్‌కు 11 రన్స్‌కు రెండు వికెట్లు (ఆలౌట్) కోల్పోయింది. 12 రన్స్ టార్గెట్ ఛేజింగ్ లో తొలి మూడు బంతులకు బిష్ణోయ్ నబీని, రహ్మనుల్లా గుర్బాజ్‌ను ఔట్ చేయడంతో అఫ్గాన్ ఒకే రన్ చేసి ఓడింది.
Virat Kohli’s Save ppppaaah ?? Enna Save Daa Fly Fly ..#ViratKohli? #INDvAFG#INDvsAFG
— U Views-தமிழ் (@UV_Official_) January 17, 2024
pic.twitter.com/GF8DaDqUFH