మహిళల టీ20 ప్రపంచ కప్ ఎక్కడ నిర్వహిస్తారనే విషయానికి తెర పడింది. బంగ్లాదేశ్ లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ కొన్ని ఉద్రిక్త పరిస్థితుల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగబోతుంది. యూఏఈ లోని రెండు వేదికలు షార్జా, దుబాయ్ లో మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబర్ 3 నుండి ప్రారంభం కానున్న ఈ టోర్నీ అక్టోబర్ 20 వరకు జరుగుతుంది.
షెడ్యూల్ ప్రకారం ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2024 బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉంది. అయితే ఆ దేశంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు కారణంగా టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్ నుంచి యూఏఈ కి తరలించాల్సి వచ్చింది. బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ కు నిర్వహించేందుకు నో చెప్పడంతో జింబాబ్వే ఈ టోర్నీ జరిపేందుకు ఆసక్తి చూపించింది. అయితే ఐసీసీ మాత్రం టీ20 వరల్డ్ కప్ యూఏఈలో జరుగుతుందని అధికారికంగా ప్రకటించడంతో ఈ సస్పెన్స్ కు తెరపడింది.
10 జట్లు.. 18 రోజులు
పది జట్లు తలపడే ఈ టోర్నీ అక్టోబర్ 3-20 వరకు జరగాల్సి ఉంది. పాల్గొనే 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, క్వాలిఫయర్ 1 ఉండగా.. ఆతిథ్య బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, క్వాలిఫయర్ 2 గ్రూప్-బి లో ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి టాప్-2 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 20న ఫైనల్ జరగనుంది.
ICC CONFIRMS UAE WILL HOST WOMEN'S T20 WORLD CUP 2024...!!!!! 🏆 pic.twitter.com/SPqZGC56pb
— Tanuj Singh (@ImTanujSingh) August 20, 2024