ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) మందలించింది. జూన్ 8న (శనివారం) ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌తో వాదించినందుకు ఐసీసీ కొరడా ఝళిపించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1 ఉల్లంఘించినందుకు అతనికి ఒక డీమెరిట్ పాయింట్‌ను అందజేశాడు. దీంతో పాటు మ్యాచ్ ఫీజ్ లో 50% జరిమానా విధించారు.
ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్ వేసిన బంతిని డెడ్ బాల్ గా ఇవ్వాల్సిందిగా వేడ్ కోరాడు. అయితే వేడ్ బంతిని డిఫెండ్ చేయడంతో అంపైర్ నితిన్ మీనన్ బంతిని డెడ్‌గా ఇవ్వలేదు. అంపైర్ నిర్ణయంతో అసంతృప్తి చెందిన ఈ ఆసీస్ వికెట్ కీపర్ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. ఈ మ్యాచ్ లో వేడ్ 10 బంతుల్లోనే 3 ఫోర్లతో 17 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ పై జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే బ్యాటింగ్‌లో రాణించిన ఆస్ట్రేలియా.. టీ20 వరల్డ్ కప్‌లో రెండో రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్ (39), ట్రావిస్ హెడ్ (34), మిచెల్ మార్ష్ (35), మార్కస్ స్టోయినిస్ (30) సమయోచితంగా రాణించడంతో శనివారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్–బి లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ 36 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 201/7 స్కోరు చేసింది.
వార్నర్, హెడ్ తొలి వికెట్‌కు 70 రన్స్ జోడించగా, మార్ష్, మ్యాక్స్‌వెల్ (28) థర్డ్ వికెట్‌కు 65 రన్స్ జత చేశారు. ఛేజింగ్‌లో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 165/6 స్కోరుకే పరిమితమైంది. బట్లర్ (42), ఫిల్ సాల్ట్ (37) రాణించారు. మిడిలార్డర్‌లో విల్ జాక్స్ (10), బెయిర్‌స్టో (7) ఫెయిలైనా, మొయిన్ అలీ (25), హ్యారీ బ్రూక్ (20 నాటౌట్), లివింగ్‌స్టోన్ (15) పోరాడినా ఫలితం లేకపోయింది.
Matthew Wade has been reprimanded for showing dissent towards Nitin Menon's decision. pic.twitter.com/DtnKTH2KDm
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 10, 2024