
దుబాయ్: ఇండియా యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అభిషేక్ 829 రేటింగ్ పాయింట్ల వద్దే కొనసాగుతున్నాడు. తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ (804), సూర్యకుమార్ (739) వరుసగా నాలుగు, ఐదు ర్యాంక్‌ల్లో ఉన్నారు. యశస్వి జైస్వాల్ (673).. 12వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
ట్రావిస్ హెడ్ (856), ఫిల్ సాల్ట్ (815) వరుసగా ఒకటి, మూడో ప్లేస్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి (706) రెండో ర్యాంక్‌లో ఉండగా, రవి బిష్ణోయ్ (674) ఆరో ర్యాంక్‌ను సాధించాడు. అర్ష్‌దీప్ సింగ్ (653), అక్షర్ పటేల్ (636) వరుసగా 9, 13వ ర్యాంక్‌ల్లో ఉన్నారు.