దుబాయ్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడే అవకాశం రాకపోయినప్పటికీ ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్‌లో టాప్ ప్లేస్ నిలబెట్టుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఫిఫ్టీలతో రాణించిన సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె, ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో ముందుకు దూసుకెళ్లారు. బ్యాటర్ల లిస్ట్‌లో రహానె 37వ ర్యాంక్ సొంతం చేసుకోగా.. శార్దూల్ 94వ ర్యాంక్ అందుకున్నాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్లు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ తొలి మూడు ర్యాంకులు సొంతం చేసుకున్నారు. కారు యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్న కీపర్ రిషబ్ పంత్ టీమిండియా టాప్ బ్యాటర్‌గా పదో ప్లేస్‌లో ఉన్నాడు. రోహిత్, కోహ్లీ 12, 13వ స్థానాల్లో మార్పు లేదు. బౌలర్లలో స్పిన్నర్ జడేజా తొమ్మిదో స్థానంలో ఉండగా... గాయంతో ఆటకు దూరంగా ఉన్న బుమ్రా రెండు స్థానాలు కోల్పోయి ఎనిమిదో ర్యాంక్‌కు పడిపోయాడు.