అండర్ 19 వరల్డ్ కప్: అఫ్గాన్పై ఇంగ్లండ్ విక్టరీ

అండర్ 19 వరల్డ్ కప్: అఫ్గాన్పై ఇంగ్లండ్ విక్టరీ

నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): 24 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లండ్ టీమ్ అండర్–19 వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం రాత్రి జరిగిన ఫస్ట్ సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్ పై 15 రన్స్ తేడాతో థ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ సాధించింది. పలుమార్లు వాన అడ్డంకిగా మారిన ఈ మ్యాచ్ లో రెండు టీమ్ లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. చివరి 10 బాల్స్ లో అఫ్గాన్ విజయానికి 18 రన్స్ కావాల్సిన టైమ్ లో ఇంగ్లండ్ యంగ్ స్పిన్నర్ రెహన్ అహ్మద్ (4/41) ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి తమ టీమ్‌‌‌‌‌‌‌‌ను గెలిపించాడు. 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తొలుత ఇంగ్లండ్ 231/6 స్కోరు చేసింది. జార్జ్ బెల్ (56), జార్జ్ థామస్ (50) ఫిఫ్టీలు కొట్టారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ 47 ఓవర్లు ఆడి 215/9 స్కోరుకు పరిమితమై ఓడింది.  అల్లా నూర్ (60), మహ్మద్ ఇషాక్ (43), అబ్దుల్​ హాది (37) రాణించినా ఫలితం లేకపోకపోయింది.