Crickek World Cup 2023: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఊహించని షాక్.. ఐసీసీ కూడా భారత్ వైపే

Crickek World Cup 2023: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఊహించని షాక్.. ఐసీసీ కూడా భారత్ వైపే

భారత్‌తో మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని ప్రేక్షకులు పాకిస్థాన్ ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారని పాక్ క్రికెట్ బోర్డు ICCకి నిన్న (అక్టోబర్ 17) అధికారికంగా ఫిర్యాదు చేయడం షాక్ కి గురి చేస్తుంది. అంతేకాదు పాకిస్థాన్ జర్నలిస్టుల వీసాల ఆలస్యం చేస్తుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. టాస్ సమయంలో బాబర్ పిచ్ ని పరిశీలిస్తున్నప్పుడు ప్రేక్షకులు అతన్ని టార్గెట్ చేశారని, మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ స్క్వాడ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.

ALSO READ : Crickek World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లాదేశ్.. కీలక మ్యాచ్‌కు షకీబ్ దూరం
 

ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ బోర్డుకు ఐసీసీ షాకిస్తూ ఆ ఫిర్యాదును పట్టించుకోలేదు. వివక్ష వ్యతిరేక కోడ్ యొక్క పరిధి వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయబడినందున పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క ఫిర్యాదుపై ICC ఎటువంటి చర్య తీసుకునే అవకాశం లేదు. దీంతో ఏదో చేద్దామనుకున్న పాక్ క్రికెట్ బోర్డు కి నిరాశ తప్పలేదు. కాగా..అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో టీమిండియా 7 వికెట్ల తేడాతో పాక్ ని చిత్తు చేసింది. భారతీయ జెండాలతో అభిమానులు స్టేడియాన్ని హోరెత్తించారు.