
ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ వివరాలను ఐసీసీ శుక్రవారం (ఫిబ్రవరి 14) వెల్లడించింది. పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో గెలిచిన జట్టు భారీ మొత్తం అందుకోనుంది. విజేతగా నిలిచిన జట్టుకు $2.24 మిలియన్లు ప్రైజ్ మనీ దక్కనుంది. భారత కరెన్సీలో ఇది అక్షరాలా రూ.20.8 కోట్ల రూపాయాలు. చివరిసారిగా జరిగిన 2017 ఎడిషన్ కంటే 53 శాతం టోర్నీ ప్రైజ్ మనీ పెరగడం విశేషం. రన్నరప్ గా నిలిచిన జట్టుకు 1.12 మిలియన్లు (రూ. 10.4 కోట్లు) అందజేస్తారు.
సెమీఫైనల్ లో ఓడిపోయిన జట్లకు రూ. 5.20 కోట్లు.. గ్రూప్ దశలో గెలిచిన ప్రతి గెలుపుకు రూ. 29.5 లక్షలు లభిస్తాయి. ఐదవ, ఆరవ స్థానంలో నిలిచిన జట్లకు రూ.3.04 కోట్లు.. ఏడవ, ఎనిమిదవ స్థానంలో నిలిచిన జట్లకు రూ. 1.21 కోట్లు ప్రైజ్ మనీ దక్కుతుంది. 1996 తర్వాత పాకిస్తాన్ ఐసీసీ ఈవెంట్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 19 నుంచి జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి.
నాలుగు జట్లు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది. తొమ్మిదో ఎడిషన్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
Also Read:-కింగ్ అని పిలవడం మానేయండి.. ఫ్యాన్స్‌కు బాబర్ అజామ్ రిక్వెస్ట్..
భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఈ మెగా టోర్నీ కోసం పాకిస్థాన్, భారత్ జట్లు తప్ప మిగిలిన దేశాలు తన స్క్వాడ్ లను ప్రకటించాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్ ఏ లో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి లో ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్
ఫిబ్రవరి 19: పాకిస్థాన్ vs న్యూజిలాండ్ (నేషనల్ స్టేడియం, కరాచీ)
ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్ vs ఇండియా (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
ఫిబ్రవరి 21: ఆఫ్ఘనిస్తాన్ vs సౌతాఫ్రికా (నేషనల్ స్టేడియం, కరాచీ)
ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (గడాఫీ స్టేడియం, లాహోర్)
ఫిబ్రవరి 23: పాకిస్తాన్ vs ఇండియా (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
ఫిబ్రవరి 25: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
ఫిబ్రవరి 26: ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్ (గడాఫీ స్టేడియం, లాహోర్)
ఫిబ్రవరి 27: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
ఫిబ్రవరి 28: ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా (గడాఫీ స్టేడియం, లాహోర్)
మార్చి 1: దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ (నేషనల్ స్టేడియం, కరాచీ)
మార్చి 2: న్యూజిలాండ్ vs భారత్ (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
మార్చి 4: సెమీ-ఫైనల్ 1 (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
మార్చి 5:సెమీ-ఫైనల్ 2 (గడాఫీ స్టేడియం, లాహోర్)
మార్చి 9: ఫైనల్ (గడాఫీ స్టేడియం, లాహోర్)
CHAMPIONS TROPHY PRIZE MONEY 💰
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 14, 2025
Champion - 20.8cr. 🥇
Runner Up - 10.4cr. 🥈
Semi Finalists - 5.2cr. 🥉 pic.twitter.com/C7GRnZIdL7