వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో థ్రిల్లింగ్ మ్యాచ్..  సూపర్ ఓవర్‌లో ఓడిన వెస్టిండీస్

వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో థ్రిల్లింగ్ మ్యాచ్..  సూపర్ ఓవర్‌లో ఓడిన వెస్టిండీస్

పసికూన జట్టైన  నెదర్లాండ్స్.. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన వెస్టిండీస్‌కు షాకిచ్చింది. వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో డచ్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. 374 పరుగులు భారీ పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. విండీస్ దాన్ని కాపాడుకోలేకపోయింది. తొలుత మ్యాచ్ టై కాగా, అనంతరం సూపర్ ఓవర్‌లో నెదర్లాండ్స్ విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. నికోలస్ పురాన్(104) సెంచరీతో మెరవగా.. బ్రెండన్ కింగ్(76), జాన్ చార్లెస్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివరలో కీమో పాల్ (25 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపులు మెరిపించడంతో విండీస్ భారీ స్కోర్ చేసింది. అనంతరం 375 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన డచ్ ఆటగాళ్లు.. ఎక్కడా తమ పోరాటాన్ని ఆపలేదు. క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ బ్యాట్ ఝులిపించారు.

తేజ నిడమనూరు(111; 76 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీతో కదం తొక్కగా.. డచ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(67) అతనికి చక్కని సహకారం అందించాడు. అయితే నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి నెదర్లాండ్స్ అంతే స్కోర్ చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. అనంతరం సూపర్ ఓవర్‌లో డక్ బ్యాటర్ వాన్ బీక్(6 బంతుల్లో 30 పరుగులు) సంచలన బ్యాటింగ్ ఆడాడు. 

విండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ వేసిన సూపర్ ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు వచ్చాయి. అనంతరం విండీస్ 8 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో వెస్టిండీస్ వరల్డ్ కప్ 2023 ఆశలను క్లిష్ట తరం చేసుకుంది.

ONE OF THE GREATEST ODI MATCH EVER.

- West Indies scored 374 runs.
- Netherlands scored 374 runs.
- Netherlands scored 30 runs in Super Over.
- West Indies scored 8 runs in Super Over.

Netherlands beat West Indies in World Cup Qualifiers. pic.twitter.com/leN4aITRn9

— Johns. (@CricCrazyJohns) June 26, 2023