
దుబాయ్: విమెన్స్ టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధానా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా జాబితాలో మంధాన ఒక ర్యాంక్ మెరుగుపడి మూడో ప్లేస్‌కు ఎగబాకింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 738 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (648).. 9వ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. దీప్తి శర్మ (537), జెమీమా రొడ్రిగ్స్ (463) వరుసగా 20, 33వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. నటాలియా సివర్ బ్రంట్ (783), లారా వోల్‌వర్ట్ (756) టాప్–2లో ఉన్నారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ (671) నాలుగో ర్యాంక్‌లో ఉంది. టీ20లో మంధాన 4వ ర్యాంక్‌లో ఉంది.