ఉమెన్స్ వరల్డ్ కప్‎కు ప్లేయర్స్ లిస్ట్

ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2022కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ టీమ్ కు మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ లు కెప్టెన్, వైస్ కెప్టెన్‎గా వ్యవహరించనున్నారు. ఐసీసీ వరల్డ్ కప్‎తో పాటు.. న్యూజిలాండ్ టూర్ కోసం కూడా జట్లను ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలిపింది. ప్రపంచకప్‌కు వెళ్లే ముందు భారత జట్టు ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో 5 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ను ఆడనుంది. అయితే  జెమీమా రోడ్రిగ్స్ మరియు ఆల్ రౌండర్ శిఖా పాండే ఫామ్ లేమి కారణంగా జట్టులోకి ఎంపికచేయబడలేదు. రోడ్రిగ్స్ గత సంవత్సరం కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయింది. వరల్డ్ కప్ టీమ్, న్యూజిలాండ్ వన్డే సీరిస్‎కు మిథాలీ రాజ్ కెప్టెన్‎గా, న్యూజిలాండ్‎తో జరిగే ఏకైక టీ20కు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ వ్యవహరించనున్నారు.

ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్
వరల్డ్ కప్ షెడ్యూల్‎లో భాగంగా భారత జట్టు మార్చి 6వ తేదీన టౌరంగలోని బే ఓవల్ స్టేడియం వేదికగా పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. మార్చి 10న హామిల్టన్ సెడాన్ పార్క్‎లో న్యూజిలాండ్ జట్టుతో, మార్చి 12న హామిల్టన్ సెడాన్ పార్క్‎లో వెస్ట్ ఇండీస్ జట్టుతో, మార్చి 16న బే ఓవల్ వేదికగా ఇంగ్లండ్ జట్టుతో, మార్చి 19న ఆక్లాండ్ ఈడెన్ పార్క్‎లో ఆస్ట్రేలియా జట్టుతో, మార్చి 22న హామిల్టన్ సెడాన్ పార్క్‎లో బంగ్లాదేశ్ జట్టుతో, మార్చి 27న క్రైస్ట్‌చర్చ్‎లోని హాగ్లీ ఓవల్ గ్రౌండులో దక్షిణ ఆఫ్రికాతో భారత మహిళల జట్టు తలపడనుంది.  

న్యూజిలాండ్‎ వన్డేలు, వరల్డ్ కప్ భారత జట్టు
మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్-కీపర్), స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (వికెట్-కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్.

స్టాండ్‌బై ప్లేయర్స్: ఎస్. మేఘన, ఏక్తా బిష్త్, సిమ్రాన్ దిల్ బహదూర్.

న్యూజిలాండ్‌ టూర్ షెడ్యూల్
ఫిబ్రవరి 9న నైపర్ లోని మెక్లీన్ పార్క్ టీ20 మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనుంది. ఫిబ్రవరి 11న మెక్లీన్ పార్క్ లో ఫస్ట్ వన్డే, ఫిబ్రవరి 14న నెల్సన్ లోని సాక్స్టన్ ఓవల్ లో రెండో వన్డే, ఫిబ్రవరి 16న సాక్స్టన్ ఓవల్ లో మూడో వన్డే, ఫిబ్రవరి 22న క్వీన్స్ టౌన్ లోని జాన్ డేవిస్ ఓవల్ స్టేడియంలో నాలుగో వన్డే, ఫిబ్రవరి 24న క్వీన్స్ టౌన్ లోని జాన్ డేవిస్ ఓవల్ స్టేడియంలో ఐదో వన్డే జరగనుంది.

న్యూజిలాండ్‌‎ టీ20కి భారత జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్-కీపర్), స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (వికెట్-కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, మేఘన, సిమ్రాన్ దిల్ బహదూర్.

For More News..

పెండ్లి కోసం రోడ్డుకెక్కిన యువకుడు

మంత్రి కేటీఆర్ పేరు చెప్పి రూ.2 లక్షల 50 వేలు వసూలు