వరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచులో టీమిండియాకు షాక్ తగిలింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయమైంది. దీంతో నొప్పితో పాండ్యా మైదానాన్ని వీడాడు.
గాయం ఎలా..
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచులో హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేసేందుకు వచ్చాడు. తొలి ఓవర్ మూడో బంతి వేయగా..ఈ బంతిని లిటన్ దాస్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. దానిని కాలితో ఆపేందుకు పాండ్యా ప్రయత్నించాడు. బంతి కాలి మడమకు బలంగా తాకింది. దీంతో పాండ్యా నొప్పితో విలవిల్లాడాడు.
ALSO READ : Crickek World Cup 2023: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఊహించని షాక్.. ఐసీసీ కూడా భారత్ వైపే
పాండ్యా మైదానాన్ని వీడటంతో కోహ్లీ ఆ ఓవర్ ను పూర్తి చేశాడు. అయితే ప్రస్తుతం పాండ్యాకు గాయం కావడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అతని గాయం తీవ్రమైందా..లేక నార్మల్ దా అని ఆందోళనలో ఉన్నారు. తీవ్రమైంది అయితే..అతను వరల్డ్ కప్ కు దూరమవుతాడా అన్న సందేహాన్ని వ్యక్త పరుస్తున్నారు. హార్దిక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.