ICC World Cup 2023: మా జట్టుకు చేతకాదు..పాకిస్తాన్ను ఏకిపారేసిన అఫ్రిది

ICC World Cup 2023: మా జట్టుకు చేతకాదు..పాకిస్తాన్ను ఏకిపారేసిన అఫ్రిది

ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిన పాక్పై ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కెప్టెన్ బాబర్ ఆజమ్తో పాటు..జట్టు ప్లేయర్లను ఏకిపారేస్తున్నారు. మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అయితే పాక్ జట్టుపై ఘాటు విమర్శలు చేశాడు. ప్రస్తుతం ఈ విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

కష్టమే..ఇలా అయితే..

పాకిస్తాన్ జట్టు ఫీల్డింగ్లో చాలా మెరుగవ్వాలని..మైదానంలో జట్టుకు అవసరమైన విధంగా ఆడకపోతే పాకిస్తాన్ గెలవడం కష్టమని షాహిద్ అఫ్రిది అన్నాడు. మైదానంలో, విలేఖరుల సమావేశంలో బాబర్ ఆజమ్ బాడీ లాంగ్వేజ్ అస్సలు బాగాలేదన్నాడు. ధైర్యంగా ఆడేవారు..ధైర్యంగా అవకాశాలను తీసుకునేవారితోనే అద్భుతాలు జరుగుతాయన్నాడు. 

చెత్త ఫీల్డింగ్..

పాకిస్తాన్ జట్టు అత్యంత చెత్తగా ఫీల్డింగ్ చేస్తోందని అఫ్రిది విమర్శించాడు. జట్టులో కెప్టెన్ అన్ని తానై నడిపించాలని సూచించాడు. ఆటగాళ్లతో ఎప్పటికప్పుడు జట్టు విషయాలు, వ్యూహాలపై మాట్లాడాలని..వారిలో ఉత్సాహాన్ని నింపాలన్నాడు. అప్పుడే ఆటగాళ్లు చురుగ్గా మ్యాచ్లో పాల్గొంటారని హితవు పలికాడు. 

సెమీస్ కష్టమే..

పాకిస్తాన్ సెమీస్ చేరడం ప్రస్తుతం కష్టమని అఫ్రిది చెప్పాడు. భారత్, ఆసీస్, అఫ్ఘాన్ చేతిలో ఓటమితో పాకిస్తాన్ జట్టు సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయన్నాడు. పాక్ సెమీస్ పోవాలంటే ఖచ్చితంగా రాబోయే నాలుగు మ్యాచుల్లో గెలవాలని..అప్పుడే సెమీస్ ఛాన్స్ ఉంటుందన్నాడు. పాకిస్తాన్ తర్వాత మ్యాచుల్లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్తో తలపడనుంది. ఈ మ్యాచుల్లో గెలవడం పాకిస్తాన్కు కత్తిమీద సాము లాంటిది.