ICC ODI World Cup 2023: సెమీస్ చేరే నాలుగు జట్లు ఇవే: మాజీ ఓపెనర్ జోస్యం

వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదలైందో లేదో అప్పుడే ప్రిడిక్షన్స్ మొదలైపోయాయి. మాజీ దిగ్గజ క్రికెటర్లు, విశ్లేషకులు.. సెమీ ఫైనల్ చేరే జట్లేవో? టైటిల్ గెలిచే జట్టేదో? అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. సెమీస్ చేరే నాలుగు జట్లు ఏవో వెల్లడించాడు. 

మెన్ ఇన్ బ్లూ(ఇండియా)తో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లు సెమీ-ఫైనల్‌ చేరతాయని సెహ్వాగ్ అంచనా వేశాడు. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా.. ఐదుసార్లు వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా 6వ టైటిల్ వేటలో ఉంది. 

ఇక సొంత గడ్డపై జరుగుతుండటం భారత్‌కు కలిసొచ్చేదే. చివరిసారి 2011లో భారత గడ్డపై ఈ మెగా టోర్నీ జరగగా.. ధోని కెప్టెన్సీలో టీమిండియా టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో మరోసారి దానిని పునరావృతం చేయాలని చూస్తోంది. ఇక నాల్గవ జట్టుగా పాకిస్తాన్‌ను ఎంచుకోవడంలో సందేహమే లేదు. ఉపఖండ పిచ్‌లు ఒకేలా ఉంటాయి కనుక పాక్‌కు అవకాశాలు ఉన్నాయి. అందులోనూ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ దాయాది దేశం బలంగా కనిపిస్తోంది. 

ALSO READ:తెలంగాణలో అవినీతి ఆకాశానికి..అభివృద్ధి పాతాళంలోకి.

సెమీస్ చేరే నాలుగు జట్లు(సెహ్వాగ్ అంచనా)

  •  ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్

శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ సైతం.. ఇవే జట్లను సెమీఫైనలిస్టులుగా అంచనా వేశారు.