వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌ల రీషెడ్యుల్‌ను ప్రకటించిన ఐసీసీ.. మ్యాచ్‌ల టికెట్ల విక్రయాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 25 నుంచి లీగ్ మ్యాచ్‌ల టికెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయని తెలిపిన గ్లోబల్ క్రికెట్ బాడీ.. సెప్టెంబర్ 15 నుండి సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
అయితే భారత్ మ్యాచ్‌ల టికెట్లు దశల వారీగా అందుబాటులో ఉండనున్నాయి. అభిమానుల మధ్య గందరగోళాన్ని తగ్గించడానికే ఇలా దశల వారీగా టికెట్లను విడుదల చేయనున్నట్లు ఐసిసి ప్రకటించింది. ఆగస్ట్ 25న, అన్ని నాన్-ఇండియా మ్యాచ్‌లు మరియు నాన్-ఇండియా వార్మప్ మ్యాచ్‌ల టికెట్ల అమ్ముకాలు ప్రారంభంకానుండగా.. భారత్ మ్యాచ్‌ల టికెట్ల విక్రయాలు ఆగస్ట్ 30 నుండి సెప్టెంబర్ 3 మధ్య అందుబాటులోకి రానున్నాయి.
టీమిండియా వార్మప్ మ్యాచ్‌ల టికెట్లు ఆగస్టు 30న ప్రారంభంకానుండగా.. ప్రధాన మ్యాచ్‌ల టికెట్లు ఆగస్టు 31 నుంచి అందుబాటులో ఉంటాయి.
వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాల వివరాలు
- ఆగస్ట్ 25: నాన్-ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, అన్ని నాన్-ఇండియా ప్రధాన మ్యాచ్‌ల అమ్మకాలు
- ఆగస్టు 30: గౌహతి, త్రివేండ్రంలో టీమిండియా వార్మప్ మ్యాచ్‌ల అమ్మకాలు
- ఆగస్టు 31: ఇండియా vs ఆస్ట్రేలియా, ఇండియా vs ఆఫ్ఘనిస్థాన్, ఇండియా vs బంగ్లాదేశ్ మ్యాచ్‌ల అమ్మకాలు
- సెప్టెంబర్ 1: ఇండియా vs న్యూజిలాండ్, ఇండియా vs ఇంగ్లండ్, ఇండియా vs శ్రీలంక మ్యాచ్‌ల అమ్మకాలు
- సెప్టెంబర్ 2: ఇండియా vs నెదర్లాండ్స్, ఇండియా vs దక్షిణాఫ్రికా మ్యాచ్‌ల అమ్మకాలు
- సెప్టెంబర్ 3: భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ (అహ్మదాబాద్)
- సెప్టెంబర్ 15: సెమీ-ఫైనల్ (ముంబై, కోల్‌కతా).. ఫైనల్ (అహ్మదాబాద్) మ్యాచ్‌ల అమ్మకాలు
టికెట్ విక్రయాల సంబంధించి రెగ్యులర్ అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఈ https://www.cricketworldcup.com/register వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని ఐసీసీ సూచించింది. ఆగస్ట్ 15 నుండి ఈ లింక్ యాక్టివ్‌గా ఉండనుంది.