World Cup 2023: వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్.. పసికూనతో టీమిండియా ప్రాక్టీస్

World Cup 2023: వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్.. పసికూనతో టీమిండియా ప్రాక్టీస్

అభిమానుల నిరీక్షణకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తెరదించింది. వరల్డ్ కప్ ప్రధాన మ్యాచ్‌లకు ముందు జరిగే.. సన్నాహక మ్యాచ్‌ల షెడ్యూల్ ను విడుదల చేసింది. 

వార్మప్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 మధ్య జరగనుండగా.. ఈ టోర్నీలో పాల్గొంటున్న 10 జట్లు ఒక్కొక్కటి రెండు వార్మప్ గేమ్‌లను ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లు గువాహటి, హైదరాబాద్ మరియు తిరువనంతపురం వేదికగా జరగనున్నాయి. 

మొదటి రోజు బంగ్లాదేశ్ vs శ్రీలంక, దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ vs పాకిస్థాన్‌లతో వార్మప్‌లు ప్రారంభమవుతాయి. ఆతిథ్య భారత జట్టు వార్మప్‌ మ్యాచ్ లను చూస్తే.. సెప్టెంబర్ 30న ఇంగ్లండ్‌తో, అక్టోబర్ 3న నెదర్లాండ్స్‌తో తలపడనుంది. వార్మప్ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం..
మధ్యాహ్నం 2:00 గంటలకు  ప్రారంభమవుతాయి.    

వరల్డ్ కప్ 2023 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్:

  • బంగ్లాదేశ్ vs శ్రీలంక, బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి
  • దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
  • స్ట్రేలియా v నెదర్లాండ్స్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం

సోమవారం 2 అక్టోబర్

  • ఇంగ్లండ్ v బంగ్లాదేశ్, బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి
  • న్యూజిలాండ్ v సౌతాఫ్రికా, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం

అక్టోబర్ 3 మంగళవారం

  • ఆఫ్ఘనిస్తాన్ v శ్రీలంక, బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి
  • ఇండియా v నెదర్లాండ్స్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
  • పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్