బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు దూరమైన ఐసీడీఎంఎస్ పదవి

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు దూరమైన ఐసీడీఎంఎస్ పదవి
  •      నల్లవెల్లి సింగిల్​ విండో చైర్మన్​ పోస్టుకు మోహన్​ రిజైన్​
  •      బలపరీక్ష  మీటింగ్​కు వెళ్లిన డీసీవోకు రాజీనామా లెటర్​ అందజేత
  •      రిజైన్  ఆమోదించినట్లు డీసీవో శ్రీనివాస్​రావు వెల్లడి 
  •      సొసైటీలో ప్రాతినిధ్యం లేనందున ఐడీసీఎంఎస్​ పదవి కోల్పోయినట్లే 
  •      జిల్లాలో  బీఆర్​ఎస్​కు మరో కీలక పదవి మైనస్​ 

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్ జిల్లా మోపాల్​ మండలం నల్లవెల్లి  సింగిల్​ విండో  సొసైటీ  ప్రెసిడెంట్​ హోదాలో  ఐడీసీఎంఎస్​ చైర్మన్​గా వ్యవహరిస్తున్న  సాంబారి మోహన్​ శుక్రవారం సొసైటీ పదవికి రాజీనామా చేశారు. మోహన్ రాజీనామాను డీసీవో ఆమోదిస్తున్నట్లు ప్రకటించగా... ఐసీడీఎంఎస్ చైర్మన్ పదవిని ఆయన ఆటోమెటిక్ గా కోల్పోయారు.  మెజారిటీ డైరెక్టర్లు ఈనెల 1న ఆయనపై అవిశ్వాసాన్ని ప్రకటించిన నేపథ్యంలో బలపరీక్ష మీటింగ్​నిర్వహణకు డీసీవో శ్రీనివాస్​రావు  సొసైటీకి వెళ్లగా ఆయనకు మోహన్ రిజైన్​ లెటర్​అందజేశారు.  దీంతో  బీఆర్ఎస్​ పార్టీ డీసీసీబీ తర్వాత మరో కీలకమైన జిల్లా పదవిని కోల్పోవాల్సి వచ్చింది. బాజిరెడ్డి గోవర్ధన్​ పార్లమెంట్​ అభ్యర్థిగా నామినేషన్​ వేసిన రోజే ఆయన దగ్గరి శిష్యుడైన సాంబారి మోహన్​ ఇలా పదవులు కోల్పోయారు. 

అవిశ్వాస మీటింగ్​లో సక్సెస్​ కష్టమని భావించి జిల్లాలో డీసీసీబీ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) తర్వాత రైతు సేవలతో ముడిపడి ఉన్న ఐడీసీఎంఎస్​ (ఇందూర్​ డిస్ట్రిక్ట్​ కోఆపరేటివ్​ మార్కెటింగ్​ సొసైటీ) చైర్మన్​ పదవికి 2020 ఏప్రిల్​లో సాంబారి మోహన్​ ఎన్నికయ్యారు.  బీఆర్​ఎస్​ గవర్నమెంట్​హయాంలో రూరల్​ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ తన వర్గీయుడికి ఈ పదవి ఇప్పించారు.  

వచ్చే ఏడాది ఏప్రిల్​ దాకా ఆయన పదవీకాలం ఉంది.  ఈ నెల1న  నల్లవెల్లి సొసైటీకి చెందిన 13 మంది డైరెక్టర్లలో తొమ్మిది మంది సాంబారి మోహన్​పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ డీసీవో శ్రీనివాస్​రావుకు లెటర్​ ఇచ్చారు.  ఈ నేపథ్యంలో స్పెషల్​ మీటింగ్​కండక్ట్​ చేయడానికి శుక్రవారం వెళ్లారు.  నో కాన్ఫిడెన్స్​ గట్టేక్కే పరిస్థితి లేనందున ఆయన సొసైటీ చైర్మన్​ పదవికి రిజైన్​చేశారు.  ఆయన రాజీనామాను యాక్సెప్ట్​ చేసిన డీసీవో వైస్​ చైర్మన్​ రమేశ్​కు ఇన్​చార్జి​ చైర్మన్​ బాధ్యతలు అప్పగించారు. 

ఐడీసీఎంఎస్​కు లింక్​ 

డీసీసీబీ తరహాలోనే జిల్లాలోని సింగిల్​ విండో సొసైటీ ప్రెసిడెంట్లు తమలో పది మందిని ఐడీసీఎంఎస్​ డైరెక్టర్లుగా ఎన్నుకుంటారు.  ఆ పది మందిలో ఒకరు ప్రెసిడెంట్​గా మరొకరు వైస్​ ప్రెసిడెంట్​గా ఓటింగ్​ విధానంలో ఎలక్ట్​ అవుతారు.  నల్లవెల్లి సొసైటీ అధ్యక్షుడి పొజిషన్​కు సాంబారి మోహన్​ రిజైన్​ చేసినందున ఐడీసీఎంఎస్​లో  డైరెక్టర్​, చైర్మన్​ పదవిని ఆటోమెటిక్​గా  కోల్పోయినట్లే.  

గత నెల డీసీసీబీ చైర్మన్​గా పోచారం భాస్కర్​రెడ్డిని నో కాన్ఫిడెన్స్​తో తప్పించి కుంట రమేశ్ ​రెడ్డిని పదవిలో కూర్చోబెట్టిన  డైరెక్టర్లు ఐడీసీఎంఎస్​ కుర్చీని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​కు చెందిన సాంబారి మోహన్​కు దూరం చేయాలనే పట్టుదలతో పావులు కదిపి సక్సెస్​ అయ్యారు.  పదవి కాపాడుకోడానికి మోహన్​ కాంగ్రెస్​లో చేరాలని ప్రయత్నించగా​ కార్యకర్తలు వ్యతిరేకత దృష్ట్యా రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి అంగీకరించలేదు. ​చివరకు తన గురువు బాజిరెడ్డి గోవర్ధన్​ పార్లమెంట్​ క్యాండిడేట్​గా నామినేషన్​ వేసిన రోజు పదవికి రాజీనామా చేయాల్సి పరిస్థితి ఎదురైంది.   

అనర్హత లెటర్​ ఇస్తం

సొసైటీ ఛైర్మన్​ పోస్టుకు సాంబారి మోహన్​ రాజీనామా చేసినందున ఐడీసీఎంఎస్​లో డైరెక్టర్​, ఛైర్మన్​ హోదాలు పోయినట్లేనని డీసీవో శ్రీనివాస్​రావు 'వెలుగు'కు క్లారిటీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక లెటర్​ ఆయనకు అందిస్తామన్నారు. 
-  డీసీవో శ్రీనివాస్​రావు