ప్రజావాణిలో కుప్పకూలిన ఐసీడీఎస్ ఉద్యోగిని

నిజామాబాద్ కలెక్టరేట్ లో ఒక్కసారిగా కుప్పకూలిన ఉద్యోగి
హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన అధికారులు
కలెక్టరేట్ లో అంబులెన్స్ ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఓ ఉద్యోగి ఒక్కసారిగా కుప్పకూలింది. ఎప్రిల్17న ప్రజావాణి కావడంతో అన్ని శాఖల అధికారులు కలెక్టరేట్ కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో పాల్గొన్న ఐసీడీఎస్ ఉద్యోగిని స్వప్న అనే మహిళ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే స్పందించిన తోటి అధికారులు హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్పృహ తప్పి పడిపోవడానికి గల కారణాలు మాత్రం అధికారులు ఇంకా తెలియజేయలేదు.

కలెక్టరేట్ కార్యాలయంలో ఫస్ట్ ఎయిడ్ కు సంబంధించి పరికరాలు, 108 అంబులెన్స్ సైతం లేకపోవడంతో ప్రభుత్వ వాహనంలో ఉద్యోగిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎండాకాలం అధిక ఉష్ణోగ్రత ఉండడంతో  వడదెబ్బ తగిలే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. కలెక్టరేట్ లో అంబులెన్స్ ని ఏర్పాటు చేయాలని ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులు కోరారు.