బోధన్, వెలుగు: తల్లిదండ్రులు ఆడపిల్లలను చదువుకు దూరం చేయొద్దని ఐసీడీఎస్పీడీ రసూల్బీ కోరారు. బోధన్ మండలం అమ్దాపూర్లో అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, ఐకేపీ సిబ్బందితో కలిసి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రసూల్బీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయని, 18 ఏండ్లు నిండకుండా పెండిళ్లు చేస్తే, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయన్నారు.
నియోజకవర్గంలో ప్రతీ పాఠశాలలోనూ ఆడపిల్లలే ఎక్కువగా డ్రాప్అవుట్అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. ప్రోగ్రామ్లో బోధన్ ప్రాజెక్ట్ సీడీపీవో జానకీ, ఐకేపీ ఏపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.