
హైదరాబాద్ లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. వనస్థలీపురంలో కాలనీ రోడ్లు కబ్జా చేసి కట్టిన కంపౌండ్ వాల్ తో పాటు ఇతర నిర్మాణాలను కూల్చి వేసింది. వనస్థలీపురంలో పలు కాలనీలకు వెళ్లే రోడ్లను స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ కబ్జా చేయటంతో శనివారం ఉదయం హైడ్రా కూల్చి వేసింది.
వనస్థలిపురం ఇంజాపూర్ లో పలు కాలనీలకు వెళ్ళే రోడ్డును స్కూప్స్ ఐస్ క్రీమ్ ఆక్రమించడంపై స్థానికులు ఫిర్యాదు చేశారు. స్థానికుల కంప్లైంట్ మేరకు ఇంజాపూర్ చేసుకున్న అధికారులు..
రోడ్డుకు అడ్డంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు.
హైడ్రా కూల్చివేతలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాలను కూల్చి వేయడాన్ని సమర్థించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు. వనస్థలీపురంలో ప్రభుత్వ భూములు, రోడ్లు కబ్జాలకు గురవుతున్నాయని, హైడ్రాతో చెరువులు, భూములు పరిరక్షిస్తుందనే నమ్మకం కలిగిందని తెలిపారు.