ఐస్​క్రీమ్ ఫ్లేవర్ ఏంటో చెప్పండి.. రూ.లక్ష గెల్చుకోండి

ఐస్​క్రీమ్ ఫ్లేవర్  ఏంటో  చెప్పండి.. రూ.లక్ష గెల్చుకోండి
  • 27న నెక్ట్స్​ప్రీమియా మాల్ లో ‘ఐస్ క్రీమ్ టేస్టింగ్ చాలెంజ్’

హైదరాబాద్ సిటీ, వెలుగు: హై బిజ్ టీవీ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఎర్రమంజిల్​లోని నెక్ట్స్​ప్రీమియా మాల్​లో ‘ది గ్రేట్ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ చాలెంజ్’ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన పోస్టర్లను మంగళవారం సిటీలోని నెక్ట్స్​ప్రీమియా మాల్ లో ఆవిష్కరించారు. సినీ హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్, బిగ్ బాస్ ఫేమ్ శ్వేత వర్మ, యాక్టర్ సమీర్ హాజరయ్యారు. ఐస్​క్రీమ్​టేస్టింగ్​చాలెంజ్​లో విజేతలకు నగదు బహుమతి ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

విన్నర్​కు రూ.లక్ష, రన్నర్​కు రూ.50 వేలు, సెకండ్​రన్నర్​కు రూ.25 వేలు ఇస్తామన్నారు. అలాగే లక్కీ డ్రా ద్వారా 25 మందికి బహుమతులు ఇస్తామని చెప్పారు. 27 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చాలెంజ్​కొనసాగుతుందని, ఎంట్రీ ఫీజును రూ. 250గా నిర్ణయించామన్నారు. ఇందులో రూ.100 విలువ చేసే ఐస్ క్రీమ్ ఓచర్ ఇస్తామన్నారు. కర్టన్​రైజర్​లో  భాగంగా కావ్య కల్యాణ్​రామ్, శ్వేతవర్మ, సమీర్​టేస్టింగ్​ చాలెంజ్​లో పాల్గొన్నారు.