Beauty Tips: వామ్మో.. ఐస్​ క్యూబ్స్​ ఇంత పని చేస్తాయా...

హైటెక్​ యుగంలో ప్రతి ఒక్కరు హెల్త్ కి తరువాత బ్యూటీ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.  గల్లీ గల్లీకి బ్యూటీ క్లినిక్​ లు వెలిసాయంటే... ఫేస్​ బ్యూటీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇక వేరే చెప్పనక్కరలేదు. ముఖంపై  ఆవగింజంత చిన్న స్పాట్​ కనపడ్డా.. కొంతమంది ఏదో అయిపోయిందని.. ఆస్పత్రులకు బ్యూటీ క్లినిక్​లకు పరిగెడుతుంటారు.  కాని ఇప్పుడు సాధారణంగా అందరి ఇళ్లలో లభించే వాటితోనే ఫేస్​ అందంగా ఉండటమే కాకుండా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.  ఇప్పుడు అలాంటి బ్యూటీ టిప్స్​తో పాటు హెల్త్​ చిట్కాలను తెలుసుకుందాం. . . .

ముఖ్యంగా ఫేస్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. వీరి కోసమే ఈ చిన్న సలహా. సాధారణంగా ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా ఫ్రిజ్ ఉండటం కామన్. ఇప్పుడు అందరూ ఫ్రిజ్ వాటరే తాగుతున్నారు. ఇంట్లో ఏమి ఉన్నా లేక పోయినా ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ అనేవి కామన్ గా ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్ లో అయితే ఫ్రిజ్ వినియోగం మామూలుగా ఉండదు.ఎండ వేడిని భరించలేక కూలింగ్ వాటర్ తాగుతూ ఉంటారు. ఇక ఐస్ క్యూబ్స్ వంటి వాటిని జ్యూస్ లు వంటి వాటిల్లో ఎక్కువగా వినియోగిస్తారు. కానీ ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ తో ఫేషియల్ చేసుకోవచ్చన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. సెలబ్రిటీలు సైతం ఎక్కువగా ఈ ఐస్ ఫేషియల్ చేయించునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. నిజానికి ఐస్ క్యూబ్స్ ఫేస్ కి చాలా మంచి చేస్తాయి.

ఐస్ క్యూబ్స్ తో ఫేషియల్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి . ముందు ఒక పాత్ర నిండా ఐస్ వాటర్ ని తీసుకోవాలి. అందులోనే కొద్దిగా ఐస్ ముక్కలను కూడా వేయాలి. ఇప్పుడు ఆ పాత్రలో ముఖాన్ని అంతా ముంచాలి. నిజానికి అన్నీ రకాల చర్మాలు ఆ చల్లదనాన్ని తట్టుకోలేవు అలాంటి అప్పుడు కొన్ని ఐస్ ముక్కలను ఓ క్లాత్ లో చుట్టి ముఖంపై కాసేపు మర్దనా చేసుకోవాలి. దీన్నే ఐస్ ఫేషియల్ అంటారు. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫేస్ ఫ్రెష్ గా అనిపిస్తుంది . మనకే ఒక్కసారి చేస్తే చేంజ్ అర్దం అయిపోతుంది .

ఐస్ ముక్కలతో ఇలా చేయడం వల్ల వడ దెబ్బ అనేది తగ్గుతుంది. అలాగే ఐస్ క్యూబ్స్ తో మర్దనా చేసుకోవడం వల్ల శరీరంలో వచ్చే నొప్పి, మంట వంటివి తగ్గుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగా పెరుగుతుంది. దీని వల్ల ఫేస్ లో ఒకలాంటి గ్లో వస్తుంది.పింపుల్స్ తో బాధ పడేవారు సైతం ఐస్ ఫేషియల్ ను చేసుకోవచ్చు. దీని వల్ల మొటిమలు కూడా తగ్గే అవకాశం ఉంది. వాటి వల్ల వచ్చే వాపు కూడా తగ్గుతుంది. ఫేస్ ఆయిల్ గా ఉండడం మొటిమలకి ముఖ్య కారణం , ఐస్ క్యూబ్స్ తో ఇలా చేస్తే ఫేస్ ఫ్రెష్ గా ఉంటుంది , మొటిమలు కూడా అంతగా ఉండవు .

ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి దూరమవుతాయి.నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఐస్ ఫేషియల్ ని చేసుకోవడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ ఐస్ ఫేషియల్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా చేస్తే మరుసటి రోజు ఉదయానికి స్కిన్ హైడ్రేట్ గా, అందంగా, ఫ్రెష్ గా ఉంటుంది.ముఖంపై ముడతలు ఉండి ఇబ్బంది ఉన్న వారు కూడా ఈ ఐస్ ఫేషియల్ చేసుకోవచ్చు. దీని వల్ల ముడతలు తగ్గి.. ముఖం అందంగా కనిపిస్తుంది.