ఐస్​మేక్​ టార్గెట్​.. రూ. 500 కోట్ల ఆదాయం

ఐస్​మేక్​ టార్గెట్​.. రూ. 500 కోట్ల ఆదాయం

హైదరాబాద్, వెలుగు: కూలర్లు, ఫ్రీజర్ల వంటి రిఫ్రిజిరేషన్ ​ సొల్యూషన్స్​ అందించే అహ్మదాబాద్​ కంపెనీ ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత నెల 28న జరిగిన ఏజీఎంలో ఈ నిర్ణయం తీసుకుంది.   ఆర్థిక పనితీరును పెంపొందించుకోవడం,  వ్యూహాత్మక విస్తరణ ప్రయత్నాల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపింది.

 కంపెనీ ప్రస్తుత ఆర్డర్ బుక్ రూ. 138 కోట్లుగా ఉంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో 25–-30శాతం పెరుగుతుందని ఐస్​మేక్​ భావిస్తోంది. యూఎస్ మార్కెట్‌‌‌‌లోకి ప్రవేశించడానికి యూఎల్​అప్రూవల్​ను పొందటానికి కూడా ఐస్ మేక్ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఐస్ మేక్  మొత్తం క్యాపెక్స్ ప్లాన్‌‌‌‌ను రూ. 200 కోట్ల నుంచి రూ. 250 కోట్లకు సవరించింది.