హైదరాబాద్, వెలుగు : ఐస్మేక్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్కమర్షియల్ ఫ్రీజర్లను లాంచ్చేయనున్నట్టు ప్రకటించింది. వీటిలో చెస్ట్ఫ్రీజర్లు, విసి కూలర్లు ఉన్నాయి. గుజరాత్లోని కంపెనీ ప్లాంటులో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వీటి తయారీని మొదలుపెడతారు. వీటి సామర్థ్యం వంద లీటర్ల నుంచి 900 లీటర్ల వరకు ఉంటుంది.
కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా హార్డ్టాప్, గ్లాస్టాప్ ఫ్రీజర్లను, కాంబీ కూలర్లను, ఫ్రీజర్లను అందుబాటులోకి తెస్తారు. ప్రతి రోజూ 25 విసి కూలర్లను తయారు చేస్తారు. వీటి కెపాసిటీ 300 లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల వరకు ఉంటుంది. ఫుడ్, బేవరేజెస్, రిటైల్సెక్టార్లకు ఇవి ఉపయోగపడతాయని ఐస్మేక్ తెలిపింది.