క్యూ4లో 30 శాతం పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం

క్యూ4లో 30 శాతం పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం

బిజినెస్ డెస్క్‌‌‌‌, వెలుగు: ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌‌‌‌ (క్యూ4)‌‌‌‌లో 30 శాతం పెరిగింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ. 7,018.71 కోట్ల  నికర లాభాన్ని సాధించిన ఈ ప్రైవేట్ బ్యాంక్‌‌‌‌కు ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  రూ. 9,121.87 కోట్లు వచ్చాయి. బ్యాంక్  నెట్ ప్రాఫిట్‌‌‌‌ క్యూ4 లో ఏడాది ప్రాతిపదికన 28 శాతం పెరిగి రూ.9 వేల కోట్లకు, నికర వడ్డీ ఆదాయం 39 శాతం పెరిగి రూ. 17,500 కోట్లకు చేరుకుంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. అలానే బ్యాంక్ అసెట్ క్వాలిటీ  కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 3.07 శాతం ఉండగా, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 3 శాతానికి దిగొస్తుందని అంచనావేశారు. ఈ అంచనాలన్నింటిని బ్యాంక్ రిజల్ట్స్ దాటేశాయి.  ఐసీఐసీఐ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం క్యూ4 లో  ఏడాది ప్రాతిపదికన 40.2 శాతం పెరిగి రూ.17,667 కోట్లకు చేరుకోగా, గ్రాస్ ఎన్‌‌‌‌పీఏల రేషియో 2.81 శాతానికి మెరుగుపడింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో బ్యాంక్ గ్రాస్ ఎన్‌‌‌‌పీఏల రేషియో 3.60 శాతంగా రికార్డయ్యింది. బ్యాంక్‌‌‌‌  నెట్‌‌‌‌ ఎన్‌‌‌‌పీఏ రేషియో 0.78 శాతం నుంచి 0.48 శాతానికి తగ్గింది. 

2022–23 లో రూ. 31,896 కోట్ల ప్రాఫిట్‌‌‌‌..

ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌కు  2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.31,896 కోట్ల  నికర లాభం వచ్చింది. 2021–22 లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ రూ.23,339 కోట్లుగా ఉంది. కిందటేడాది మార్చి నాటికి రూ.10.6 లక్షల కోట్లుగా ఉన్న బ్యాంక్ డిపాజిట్లు 10.9 శాతం పెరిగి ఈ  ఏడాది మార్చి నాటికి రూ.11.8 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ రిటైల్‌‌‌‌ లోన్లు ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఏడాది ప్రాతిపదికన 22.7 శాతం గ్రోత్ నమోదు చేశాయి. మార్చి నాటికి బ్యాంక్‌‌‌‌ ఇచ్చిన లోన్లలో 54.7 శాతం వాటా రిటైల్ లోన్లదే ఉంది.  బిజినెస్‌‌‌‌లకు ఇచ్చిన లోన్లు 34.9 శాతం క్యూ4 లో పెరగగా, చిన్న మధ్యతరహా కంపెనీలకు ఇచ్చిన లోన్లు 19.2 శాతం పెరిగాయి. షేరుకి రూ.8 ఫైనల్ డివిడెండ్‌‌‌‌ ఇచ్చేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. బ్యాంక్ షేరు శుక్రవారం రూ. 888 వద్ద సెటిలయ్యింది.

కస్టమర్ల డేటా లీక్ కాలేదు..

ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌కు చెందిన సుమారు 36 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్ అయ్యిందని  రిపోర్ట్స్ రావడంపై బ్యాంక్  స్పందించింది.  డేటా లీక్  జరిగినట్టు ఆధారాలేవీ లేవని  ప్రకటించింది.  ‘అర్థం పర్దం లేని, తప్పుడు వార్తలివి. డేటా లీక్ అయినట్టు ఎటువంటి ఆధారాల్లేవు’ అని ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సందీప్ బాత్ర అన్నారు. ‘డేటా లీక్‌‌‌‌కు సంబంధించి సైబర్‌‌‌‌‌‌‌‌న్యూస్‌‌‌‌ షేర్ చేసిన యూఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌ ఫేక్‌‌‌‌. మేము ఆధారాలు చూపమన్నాం. కానీ, వారు చూపలేకపోయారు’  అని బాత్రా వివరించారు.