ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం జూన్ క్వార్టర్లో 9.96 శాతం పెరిగి రూ.11,695.84 కోట్లకు చేరుకుంది. 2023–-24 లోని ఇదే కాలంలో రూ.10,636.12 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన, బ్యాంకు లాభం 14.62 శాతం పెరిగి రూ. 11,059 కోట్లకు చేరుకుంది. గత ఏడాది జూన్ క్వార్టర్లో రూ. 9,648.2 కోట్లు వచ్చాయి.
ఈ ఏడాది ఏప్రిల్–-జూన్లో మొత్తం ఆదాయం రూ. 38,763 కోట్ల నుంచి రూ. 45,998 కోట్లకు పెరిగింది. ఖర్చులు రూ.24,624 కోట్ల నుంచి రూ.29,973 కోట్లకు పెరిగాయి. ప్రొవిజన్లు రూ.1,332.18 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది జూన్లో వీటికి రూ.1,292.44 కోట్లు, మార్చి క్వార్టర్లో రూ.718.49 కోట్లు కేటాయించారు. జూన్ 30, 2024 నాటికి స్థూల ఎన్పీఏల నిష్పత్తి 2.36 శాతం ఉంది.