విద్యార్థుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ సప్ఫిరో ఫారెక్స్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

విద్యార్థుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ సప్ఫిరో ఫారెక్స్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:    ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం ప్రీ-పెయిడ్ సఫైరో ఫారెక్స్ కార్డ్​ను ప్రారంభించింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించామని తెలిపింది.  విద్యార్థులు,  వారి తల్లిదండ్రులకు విదేశాల్లో ఖర్చులు, అడ్మిషన్ ఫీజులు, కోర్సు సంబంధిత ఫీజులు,  ప్రయాణం, డైనింగ్,  కిరాణా సామగ్రితో సహా ఇతర రోజువారీ ఖర్చుల కోసం దీనిని వాడుకోవచ్చని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.  

కార్డ్ లావాదేవీలపై ఎటువంటి క్రాస్- కరెన్సీ మార్క్-అప్ చార్జీలను వసూలు చేయబోమని పేర్కొంది. కస్టమర్లు15 కరెన్సీలలో  లావాదేవీలు చేసుకోవచ్చని, కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక కరెన్సీని మాత్రమే లోడ్ చేసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించడం వీలవుతుంది. ఈ కార్డ్ తీసుకున్నందుకు  రూ. 15,000 విలువైన ప్రయోజనాలు ఉంటాయని ఐసీఐసీఐ తెలిపింది.