సేవింగ్స్ డిపాజిట్ రేటును.. 0.25 శాతం తగ్గించిన ఐసీఐసీఐ

సేవింగ్స్ డిపాజిట్ రేటును.. 0.25 శాతం తగ్గించిన ఐసీఐసీఐ

ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతాలపై డిపాజిట్ వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించిందని కంపెనీ  వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ తెలిపింది. ఆర్​బీఐ వరుసగా రెండు సార్లు వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కూడా రేట్లకు కోత పెట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్ డిపాజిటర్లు తమ సేవింగ్స్ బ్యాంక్ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌పై రూ.50 లక్షల వరకు 2.75 శాతం వడ్డీని పొందుతారు. 

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కూడా ఇదే మొత్తంలో వడ్డీ ఇస్తోంది. రూ.50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌లకు వడ్డీని 3.25 శాతానికి తగ్గించామని ఐసీఐసీఐ తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త రేట్లు బుధవారం నుంచి వర్తిస్తాయి. ఎస్​బీఐ ప్రస్తుతం సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు 2.70 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇతర బ్యాంకు కూడా టర్మ్ డిపాజిట్ రేటును తగ్గించాయి.