హైదరాబాద్, వెలుగు: వ్యక్తులు, కుటుంబాల కోసం ఎలివేట్ హెల్త్ పాలసీని అందుబాటులోకి తెచ్చినట్టు ఐసీఐసీఐ లాంబార్డ్ ప్రకటించింది. హాస్పిటల్‌లో చేరడం, సర్జరీలు, మందులు, వైద్య పరీక్షలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులను ఈ పాలసీ కవర్ చేస్తుందని తెలిపింది. యోగా, ఆయుర్వేదం వంటి ప్రత్యామ్నాయ చికిత్సలకు కూడా కొన్ని పాలసీలు కవరేజీని అందిస్తాయి.
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ చార్జీలను కూడా కవర్ చేస్తుంది. ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులను భరిస్తుంది. క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్, ఓపెన్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ పాలసీ సదుపాయాలూ ఉన్నాయి. కస్టమర్ తన అవసరాలకు తగ్గట్టుగా ఏఐ సాయంతో పాలసీని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలివేట్‌లో క్లెయిమ్ మొత్తానికి పరిమితి లేదని, ఎంత ఖర్చయినా భరిస్తామని కంపెనీ తెలిపింది. ఏటా 100శాతం క్యుములేటివ్ బోనస్ సదుపాయం కూడా ఉందని పేర్కొంది.