ఐసీఐసీఐ నికర లాభం రూ.13,502 కోట్లు

ఐసీఐసీఐ  నికర లాభం రూ.13,502 కోట్లు

ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో కన్సాలిడేటెడ్​ లెక్కన నికర లాభం 15.7 శాతం పెరిగి రూ.13,502 కోట్లకు చేరుకుందని ఐసీఐసీఐ బ్యాంక్ శనివారం ప్రకటించింది. స్టాండెలోన్​ ప్రాతిపదికన ఈ క్వార్టర్లో నికర లాభం రూ.12,630 కోట్లుగా నమోదైంది. ఇది వార్షికంగా 18 శాతం పెరిగింది.  

నికర వడ్డీ ఆదాయం 11 శాతం పెరిగి రూ.21,193 కోట్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో రూ.19,093 కోట్లుగా ఉంది. ట్రెజరీ మినహా వడ్డీయేతర ఆదాయం 18.4 శాతం పెరిగి రూ.7,021 కోట్లకు చేరుకుంది. మార్చి క్వార్టర్లో కేటాయింపులు రూ.891 కోట్లు కాగా, గత సంవత్సరం ఇదే కాలంలో రూ.718 కోట్లుగా ఉన్నాయి. 

మార్చి 2025 చివరి నాటికి స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (గ్రాస్​ఎన్​పీఏలు) 1.67 శాతానికి మెరుగుపడగా, ఇది డిసెంబర్ 2024లో 1.96 శాతం ఉంది.