మహిళల ఐసీఐసీఐ గుడ్ న్యూస్.. లేడిస్ కోసం కొత్త హెల్త్​ఇన్సూరెన్స్ స్కీమ్

మహిళల ఐసీఐసీఐ గుడ్ న్యూస్.. లేడిస్ కోసం కొత్త హెల్త్​ఇన్సూరెన్స్ స్కీమ్

హైదరాబాద్​, వెలుగు: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్​ఇన్సూరెన్స్​ప్రొడక్ట్​ ‘ఐసీఐసీఐ ప్రూ విష్’ని విడుదల చేసింది. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులు వంటి తీవ్రమైన వ్యాధులకు ఈ ప్లాన్ కవరేజ్ ఇస్తుంది. మాస్టెక్టమీ, హిస్టరెక్టమీ వంటి సర్జరీలకు కూడా ఈ ప్లాన్ కవరేజ్ ఇస్తుంది. 

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, యుటెరైన్ రప్చర్ వంటి సమస్యలకు కూడా కవరేజ్ పొందవచ్చు. ఈ ప్లాన్‌‌‌‌లో క్లెయిమ్స్‎కు తక్షణమే చెల్లింపు జరుగుతుంది. ప్రీమియం మొత్తం 30 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. ఇందులో  ప్రీమియం హాలిడే విధానం ఉంటుంది. అంటే, కస్టమర్​ఒక సంవత్సరం పాటు ప్రీమియం చెల్లించకుండా ఉండే అవకాశం కూడా ఉంది.