ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఏయూఎం రూ.3.14 లక్షల కోట్లకు

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఏయూఎం రూ.3.14 లక్షల కోట్లకు

హైదరాబాద్​, వెలుగు: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. నిర్వహణ (ఏయూఎం) కింద ఆస్తుల విలువ రూ. 3 లక్షల కోట్లను దాటింది. గత నెల 31 నాటికి కంపెనీ ఏయూఎం రూ 3.14 లక్షల కోట్లుగా ఉంది. కంపెనీ జూన్ 2024 నాటికి దాని అన్ని వ్యాపార విభాగాలలో 9.84 కోట్ల మందికి జీవిత బీమా రక్షణను అందించింది. 

జూన్ 2022లో 6.19 కోట్ల పాలసీల నుంచి 59శాతం వృద్ధిని సాధించింది. జూన్ 30, 2024 నాటికి  ఇన్-ఫోర్స్ హామీ మొత్తం రూ.35.10 లక్షల కోట్లుగా ఉంది. ఈ విజయాలు కస్టమర్ల దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సాయపడతాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది.  క్లెయిమ్‌‌‌‌‌‌‌‌లను వేగంగా పరిష్కరించడం ద్వారా ఆర్థిక భద్రతను అందిస్తున్నామని పేర్కొంది.  2024లో క్లెయిమ్ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్ నిష్పత్తి 99.17శాతం ఉంది.