న్యూఢిల్లీ: తన సబ్సిడరీ కంపెనీ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ డీలిస్టింగ్ ప్రపోజల్‌ను ఐసీఐసీఐ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు గురువారం పరిశీలించనుంది. దీంతో ఇంట్రాడేలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేర్లు బీఎస్ఈలో 15 శాతం ఎగసి 52 వారాల గరిష్ట లెవెల్ రూ. 650 ని తాకాయి. స్కీమ్ ఆఫ్ ఎరేంజ్మెంట్ కింద సబ్సిడరీ కంపెనీ షేర్ల డీలిస్టింగ్ ప్రపోజల్ పరిశీలనకు డైరెక్టర్ల బోర్డు సమావేశమవుతున్నట్లు బ్యాంకు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది.
ALSO READ:రూ.కోటి వరకు లోన్లు ఆన్ లైన్ లోనే.. తన రూపురేఖలను మార్చేసిన సిడ్బీ..
మరోవైపు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కూడా ఈ స్కీమ్ ప్రపోజల్డిస్కస్ చేసేందుకు గురువారం కలవనున్నట్లు వెల్లడించింది. ఈక్విటీ ఫ్రాంచైజీ రిటెయిలింగ్, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్‌తోపాటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలనూ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నిర్వహిస్తోంది. 1995 మే లో మొదలైన ఈ కంపెనీ అంచెలంచెలుగా ఎదిగింది. ఇంట్రాడే లాభాల్లో కొంత పోగొట్టుకున్న ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేర్లు 10.68 శాతం లాభంతో రూ. 624 వద్ద క్లోజయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు కొద్దిపాటి లాభంతో రూ. 927.40 వద్ద ముగిశాయి.