ఇండియాలో HMPV వైరస్ ఒకటి కాదు.. రెండు కేసులు.. ICMR కన్ఫార్మ్ చేసేసింది..

ఇండియాలో HMPV వైరస్ ఒకటి కాదు.. రెండు కేసులు.. ICMR కన్ఫార్మ్  చేసేసింది..

బెంగళూరు: HMPV వైరస్ భారత్లోకి ప్రవేశించింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు HMPV వైరస్ సోకినట్లు వైద్యఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఐసీఎంఆర్ కూడా రెండు పాజిటివ్ కేసులు కర్ణాటకలో వెలుగుచూసినట్లు నిర్ధారించింది. HMPV రెండు పాజిటివ్ కేసుల బాధితులు చిన్నారులే కావడంతో పిల్లల తల్లిదండ్రులకు భయం పట్టుకుంది. పైగా.. నెలల వయసున్న చిన్నారులను ఈ HMPV అటాక్ చేసింది. బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్ లో ఈ రెండు పాజిటివ్ కేసులు వెలుగు చూడటం గమనార్హం.

Also Read : ఇదీ కరోనా లాంటిదే గానీ.. కోవిడ్-19 వైరస్కు, HMPV వైరస్కు తేడా ఇదే..

తొలుత బయటపడిన పాజిటివ్ కేసు బాధిత చిన్నారి 8 నెలల పసికందు కాగా, రెండో పాజిటివ్ కేసు మరింత ఆందోళన కలిగించేలా 3 నెలల పసికందు కావడం టెన్షన్ను మరింత పెంచుతోంది. HMPV పాజిటివ్ సోకిన ఈ ఇద్దరి పిల్లలకు గానీ, పిల్లల కుటుంబాలకు గానీ రీసెంట్గా ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదని తెలిసింది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పసికందుల్లో, చిన్నారుల్లో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నట్లు సమాచారం.

HMPV వైరస్ లక్షణాలు
* దగ్గు , ముక్కు కారడం లేదా మూసుకుపోవడం .
* జ్వరం,  గొంతునొప్పి, తుమ్ములు రావడం
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
 * కొన్ని సందర్భాల్లో శరీరంపై దద్దుర్లు
 
HMPV వ్యాప్తి, నివారణ
* హెచ్ఎంపీవీ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.  
* వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు  గాలి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది.   
* వైరస్ సోకిన వ్యక్తులు ఇతరులను   తాకడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, సన్నిహితంగా ఉండడం చేయకూడదు. 
* అపరిశుభ్రంగా ఉంటూ కళ్లను, ముక్కును, చెవులను తాకడం  చేయకూడదు. 
* చేతులను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. మాస్కులు ధరించాలి