హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (నిన్)లో రెండేళ్ల పోస్ట్-గ్రాడ్యుయేషన్ కోర్సులో అడ్మిషన్స్‌కు నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
కోర్సులు: ఎంఎస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్): 24 సీట్లు, ఎంఎస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్): 18 సీట్లు ఉన్నాయి.
అర్హత: ఎంబీబీఎస్/ బీడీఎస్ లేదా సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. కోర్సు రెండేళ్లు ఉంటుంది. ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్లైన్లో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు జనరల్/ ఓబీసీలు రూ.3000; ఎస్సీ/ ఎస్టీ/ అభ్యర్థులకు రూ.1500 చెల్లించాలి. పరీక్ష జూన్ 23న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.nin.res.in వెబ్సైట్లో సంప్రదించాలి.