ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. మరో క్రేజీ దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు బన్నీ. అది కూడా మరో పాన్ ఇండియా మూవీ కోసం. ఇప్పటికే రజినీకాంత్(Rajinikanth) కు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు.. ఇప్పుడు అల్లు అర్జున్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇంతకీ ఆ దర్శకుడు మరెవరో కాదు నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dileep Kumar).
అవును తమిళ దర్శకుడు నెల్సన్ కుమార్ తో అల్లు అర్జున్ ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ వార్త రెండు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే నెల్సన్ రజినీకాంత్ హీరోగా జైలర్ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. చాలా కాలంగా హిట్టు కోసం చూస్తున్న రజినీకి జైలర్ మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ పడింది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. దీంతో ఈ దర్శకుడుతో సినిమాలు చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే నెల్సన్ తన తరువాతి సినిమాను అల్లు అర్జున్ తో చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ కాంబోని రేసుగుర్రం నిర్మాత నల్లమలపు బుజ్జి సెట్ చేస్తున్నారట. అంతేకాదు.. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కు సంబందించిన కథ చర్చలు కూడా పూర్తయ్యాయని, బన్నీకి కథ చెప్పడం కూడా జరిగిందని తెలుస్తోంది. ఆయనకు కథ బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశారట. దీంతో దర్శకుడు నెల్సన్ కథకు తుదిమెరుగులు దిద్దే పనిలో పెడ్డారట. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.