Allu Arjun: పుకార్లకు చెక్.. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నెక్స్ట్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. ఈ ప్రాజెక్టుపై మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. నేడు(ఏప్రిల్ 8) అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా గత కొన్నిరోజులుగా వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చేశారు. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా మాతోనే అంటూ అనౌన్స్ చేశారు. దీంతో కొంతకాలంగా కన్ఫ్యూజన్లో ఉన్న ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప 2 సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన పుష్ప 2 టీజర్ కు ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ, పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై కొంతకాలంగా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిలో తమిళ దర్శకుకాదు అట్లీ సినిమా ఒకటి. ఈ కాంబోలో ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఫ్యాన్స్ కూడా ఇదే ప్రాజెక్టు ఫైనల్ అయ్యింది అనుకున్నారు. 

కానీ, అనూహ్యంగా ఆ ప్రాజెక్టుకు చెక్ పెడుతూ.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అల వైకుంఠపురంలో తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ మరోసారి సినిమా చేయనున్నారని వార్తలు వినిపించాయి. వాటినే నిజం చేస్తూ.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాబోలో రానున్న నాలుగు సినిమాపై క్లారిటీ ఇచ్చాడు మేకర్స్. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేస్తూ వీడియో కూడా విడుదల చేశారు. ఈసారి మైథలాజికల్ కథతో రానునట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి అదే కాంబోలో సినిమాను ప్రకటించారు మేకర్స్.

తాజాగా బన్నీ పుట్టినరోజు సందర్బంగా నెక్స్ట్ సినిమా తమతోనే అని ఫిక్స్ చేశారు. దీంతో కొంతకాలంగా అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా గురించి వస్తున్న వార్తలకు పుళిష్టాప్ పడింది. మరో ఈ ప్రాజెక్టు ఎప్పుడు ఫ్లోర్ పైకి వెళ్లనుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఈ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.