Allu Arjun: ఐకాన్ స్టార్ సెన్సేషనల్ రికార్డ్.. సౌత్లో ఏకైక స్టార్ ఆయనే!

సౌత్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన యాక్టింగ్, డాన్స్, స్టైలింగ్ అంటే పడిచచ్చిపోతారు ఫ్యాన్స్. ఇక పుష్ప సినిమా తరువాత ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఈ సినిమాతో నార్త్ లో సైతం తన సత్తాచాటుకున్నారు బన్నీ. అసలు ఏమాత్రం అంచనాలు, ప్రేమోషన్స్ లేకుండా హిందీలో విడుదలైన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే.. తెలుగు కన్నా హిందీ మార్కెట్ లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది ఈ సినిమా. 

దాంతో ఆల్ ఓవర్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఈ నేపధ్యంలోనే తాజాగా సంచలన రికార్డ్ క్రియేట్ చేశాడు బన్నీ. ఇన్స్టాగ్రామ్ లో సౌత్ హీరోలెవరికి సాధ్యం కానీ రేర్ ఫీట్ సాధించాడు ఐకాన్ స్టార్. అదేంటంటే.. ప్రెజెంట్ ఇన్​స్టాగ్రామ్​లో బన్నీను ఫాలో అవుతున్నవారి సంఖ్య 25 మిలియన్లు. అలా సౌత్​లో 25 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన మొదటి, ఏకైక యాక్టర్​గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆయన తరువాతి స్థానంలో 21.3 మిలియన్లతో విజయ్ దేవకరొండ, 20.8 మిలియన్లతో రామ్ చరణ్​, 14.1 మిలియన్లతో దుల్కర్ సల్మాన్, 13.5 మిలియన్లతో యశ్, 13.4 మిలియన్లతో మహేశ్ బాబు, 11.7 మిలియన్లతో ప్రభాస్, 10.8 మిలియన్లతో దళపతి విజయ్ ఉన్నారు. ఇంతమంది స్టార్ హీరోలను దాటేసుకొని టాప్ లో నిలిచారంటే ప్రస్తుతం అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి అర్థమవుతోంది. 

 

 

ప్రస్తుతం ఆయన పుష్ప2 సీక్వెల్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆయన క్రేజ్ ఇంకా పెరగనుందని ట్రేడ్ వర్గాల అంచనా. కేవలం అల్లు అర్జున్ డిమాండ్ వల్లనే ఈ సినిమాకు దాదాపు వెయ్యి కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది. కాబట్టి ఈ సినిమాతో ఆయన స్థాయి నెక్స్ట్ లెవల్ కు చేరుకోవడం ఖాయం. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.