టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన డిసెంబర్ 05న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. దీంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోపుష్ప మేనియా మొదలైంది. ఇంటర్నెట్ లో కూడా పుష్ప 2 హంగామా మొదలైందని చెప్పవచ్చు. దాదాపుగా రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
హిట్ టాక్ పడితే మాత్రం ఇప్పటివరకూ ఇండస్ట్రీలో క్రియేట్ అయిన రికార్డులు మొత్తం బ్రేక్ అవుతాయని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం పుష్ప 2 సినిమాకి టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటుతోపాటూ స్పెషల్, అడిషనల్ షోస్ కి పర్మిషన్స్ ఇచ్చింది. దీంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ దాదాపుగా 12500 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది.
అయితే పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ దాదాపుగా రూ.240 కోట్లు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మాములుగా ఇప్పటితరం హీరోలు రెమ్యునరేషన్ కి బదులు సినిమా చేసిన బిజినెస్ లో 20 నుంచి 25% శతం షేర్ తీసుకుంటున్నారు. దీంతో రిలీజ్ కి ముందే పుష్ప2: ది రూల్ దాదాపుగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి రూ.1060 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
Also Read : నా సినిమాని తెలుగు హీరోలు రిజెక్ట్ చేశారు
ఇందులో 24 పర్సెంట్ కాలికులెట్ చేస్తే ఇంచుమించుగా రూ.240 కోట్లు షేర్ అల్లు అర్జున్ అందుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినీ హిస్టరీలోనే ఇంతపెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్న హీరోలలో అల్లు అర్జున్ టాప్ లో ఉన్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా టాలీవుడ్ లో ఇప్పటివరకూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోలలో ప్రభాస్, తారక్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితరులు టాప్ 5 స్థానాల్లో ఉన్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఏపీ-తెలంగాణలో పుష్ప 2 కి భారీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంది. ఇందులోభాగంగా పుష్ప 2 రూ.215 కోట్లు కలెక్ట్ చెయ్యాల్సి ఉంది. అయితే ఇటీవలే వరల్డ్ వైడ్ గా టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ చెయ్యగా ఇప్పటికే 65 కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇందులో ఓవర్సీస్ లో $2 మిలియన్లు ఉండగా, మనదేశంలో రూ.40 కోట్లకి పైగా కలెక్షన్లు ఉన్నాయి.