పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపిన ఐకాన్ స్టార్.. ట్వీట్ వైరల్

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ వేడి ఒక రేంజ్ లో ఉంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ వేడి ఇంకో రేంజ్ అని చెప్పాలి.2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్, ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి తీరాలన్న కసితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీతో పాటు పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు, టీవీ ఆర్టిస్టులు కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు.

 

ఇప్పటికే పవన్ కళ్యాణ్ తరఫున మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం నిర్వహించగా న్యాచురల్ స్టార్ నాని కూడా ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు. పవన్ కు మద్దతుగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసిన బన్నీ "ఒక ఫ్యామిలీ మెంబర్ గా తన సపోర్ట్ ఎల్లప్పుడూ మీకే ఉంటుందని, మీరు ఎంచుకున్న మార్గానికి, చేస్తున్న సేవను చూసి గర్వపడుతున్నానని" అన్నారు.