పునీత్ రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించిన అల్లుఅర్జున్

పునీత్ రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించిన అల్లుఅర్జున్

బెంగళూరు: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులను అల్లుఅర్జున్ పరామర్శించారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్‌లో గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ పునీత్ చిన్న వయసులోనే వ్యాయామం చేసిన తర్వాత గుండెపోటుకు గురై చనిపోయిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్రనటులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళు అర్పించారు. అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన వారు ఆ తర్వాత బెంగళూరు వెళ్లి పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, దర్శక ధీరుడు రాజమౌళి.. తోపాటు దక్షిణాదికి చెందిన సినీతారలు చాలామంది బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ కుటుంబానికి చిరపరిచితులైన పునీత్ కుటుంబ సభ్యులను కలవలేకపోయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇవాళ బెంగళూరులో ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒక వైపు కరోనా కేసులు... మరోవైపు ‘పుష్ఫ’ సినిమా అవుట్ డోర్ అంతా అడవుల్లో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో వెళ్లలేకపోయానని అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  ఇవాళ బెంగళూరు వెళ్లిన అల్లు అర్జున్ ముందుగా పునీత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పునీత్‌ ఇంటికి వెళ్లి  కుటుంబ సభ్యులను కలిశారు. 

 

ఇవి కూడా చదవండి..

నష్టం జరుగుతున్నప్పుడు తిరగబడాల్సిందే

‘మహాన్’... ట్రైలర్ అదిరింది

ఎన్నికల ముందు చెప్పిన మాటలు చేతల్లో కనిపించట్లే

కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి