ఈ హోటల్ కు 70 ఏళ్ల చరిత్ర.. కాలంతో మారలేక కనుమరుగు అవుతుంది

ఈ హోటల్ కు 70 ఏళ్ల చరిత్ర.. కాలంతో మారలేక కనుమరుగు అవుతుంది

కాలంతోపాటు మారాల్సిందే.. మారి తీరాల్సిందే.. లేకపోతే ఆ కాలమే మనల్ని కాల గర్భంలో కలిపేస్తుంది.. జీవిత పాఠం ఇది.. నీకు ఎంత చరిత్ర ఉంది.. ఎంత గొప్ప పేరు ఉంది అనేది కాదు ఇక్కడ పాయింట్.. పాత చరిత్రను కొత్త చరిత్రలోకి ఎలా తీసుకెళుతున్నావ్.. నీకున్న పేరును కొత్తగా ఎలా రాస్తున్నావ్ అనేది ఎంతో ముఖ్యం. లేకపోతే ఎంత పెద్ద హిస్టరీ ఉన్నా.. అది చరిత్రకే పరిమితం అవుతుంది.. ఇలాంటి సంఘటన ఇప్పుడు బెంగళూరు వాసులు చూస్తున్నారు.. తమ కళ్లతో.. అదే న్యూ కృష్ణ భవన్.. 1954లో ప్రారంభం అయిన ఈ హోటల్.. బెంగళూరుకే కాదు.. కొత్త రుచులకు పేరు పెట్టింది.. ఎంతలా అంటే.. ప్రతి రోజూ 2 వేల 500 మంది ఇక్కడ భోజనం చేసేవారు.. 100 కుటుంబాలు ఈ హోటల్ ద్వారా జీవితాన్ని, జీతాన్ని పొందాయి.. అలాంటి హోటల్ ఇప్పుడు మూసేస్తున్నారు.. డిసెంబర్ 6వ తేదీ నుంచి ఇక కనిపించదు.. చరిత్రలో కలిసిపోతుంది.. ఈ విషయాన్నే ఇప్పుడు బెంగళూరు వాసులు.. ముఖ్యంగా నాటి తరంలో మిగిలి ఉన్న.. ఈ హోటల్ లో అనుబంధం ఉన్న వ్యక్తులు పదేపదే గుర్తు చేసుకుని మధన పడుతున్నారు.. ఈ న్యూ కృష్ణ భవన్ విశేషాలు ఏంటో తెలుసుకుందామా...


బెంగుళూరులోని ప్రముఖ పురాతన రెస్టారెంట్లలో ఒకటైన న్యూకృష్ణభవన్ (ఎన్ కేబీ) తన సేవలనుంచి రిటైర్మెంట్ తీసుకోబోతోంది. శాఖాహార భోజనానికి ప్రసిద్ధి చెందిన ఈ రెస్టారెంట్ యాజ మాన్యం.. మూసివేత ప్రకటనతో సైన్ బోర్డులు ఉంచడం ఆశ్చర్యానికి గురి చేసింది. శాఖాహార బోజనాలు, పచ్చి మసాల ఇడ్లీ, మండ్యా శైలి రాగి దోసెలతోపాటు సాంప్రదాయ శాఖమార విందులుకు ఈ న్యూకృష్ణ భవన్ రెస్టారెంట్ ఫేమస్.. బెంగళూరులోని మల్లేశ్వరం  నడిబొడ్డున సంపిగే థియేటర్ ఎదురుగాఉన్న ఈ రెస్టారెంట్ డిసెంబర్ 6 న చివరి భోజనాన్ని అందించనుంది.