మేడారం పూజారులకు ఐడీ కార్డులు

తాడ్వాయి, వెలుగు : మేడారం జాతర సందర్భంగా పూజారులకు పోలీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ తరఫున ప్రత్యేక ఐడీ కార్డులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్‌‌రెడ్డి మాట్లాడుతూ సమ్మక్క పూజారులకు రెడ్‌‌ ట్యాగ్‌‌, సారలమ్మ పూజారులకు బ్లూ ట్యాగ్‌‌లతో ఐడీ కార్డులు జారీ చేస్తున్నట్లు చెప్పారు.

జాతర సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాల నిర్వహణకు పూజారులు పలు చోట్లకు తిరుగుతుంటారని, అలాంటి టైంలో వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. కార్డులు కలిగిన పూజారులను ఎక్కడా ఆపవద్దని సూచించారు.